భారీగా తగ్గిన బంగారం ధర !!............


బంగారం ధర భారీగా తగ్గింది. మూడు వారాల కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం (ఫిబ్రవరి 10)  రూ.400 డౌన్ అయ్యింది. 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.29వేల 500కు చేరింది. కొనుగోళ్లు తగ్గటమే ధర పడిపోవటానికి ప్రధాన కారణం అంటున్నారు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు. మరోపక్క వెండి ధర కిలో రూ.490 తగ్గి రూ.42వేల 250కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి మద్దతు లభించకపోవడంతో వెండి ధర తగ్గిందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ట్రేడింగ్ సానుకూలంగా లేకపోవడం కూడా ధర తగ్గటానికి కారణంగా అంచనా వేస్తున్నారు వ్యాపారులు. హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 29వేల 780గా ఉంటే.. 22 క్యారెట్ల ఆభరణాలు 10 గ్రాములు 27వేల 850గా ఉంది.


0 comments:

http://go.ad2up.com/afu.php?id=1018718